Mammotty | మలయాళం సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మలయాళ ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతోన్న వేధింపులపై కేరళ ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీ (Hema Committee Report)ని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ ఆ పరిశ్రమను కుదిపేస్తోంది. అయితే ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్‌పై తాజాగా మెగాస్టార్ మమ్ముట్టి స్పందించాడు.
ఈ పోస్ట్ మలయాళ సినిమా ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితుల ఆధారంగా చేసింది. ఇన్ని రోజులు ఈ ఘటనపై స్పందించకపోవడానికి కారణం. ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీనటులు, అండగా ఉండే అసోసియేషన్ స్పందించాలి. నేను కూడా నటుడిగా నా అభిప్రాయాన్ని తెలియజేయాలని అనుకున్నాను. సినిమా అనేది సమాజానికి ప్రతిరూపం. సమాజంలోని మంచి చెడులన్నీ సినిమాలో ఉంటాయి. సినిమా పరిశ్రమ అంటే సమాజం చాలా శ్రద్ధ చూపుతుంది.
అందుకే అక్కడ జరిగే చిన్న సమస్య అయిన పెద్దగా కనిపిస్తుంది. ఈ రంగంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిత్ర నిర్మాతలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఎన్నడూ జరగకూడనిది ఘటనలు ఏదైనా జరిగిన తర్వాత సినిమా పరిశ్రమను అధ్యయనం చేసి, పరిష్కారాలను సూచించడానికి, అలాగే చర్యలను చేపట్టడానికి ఒక నివేదికను సిద్ధం చేయడానికి ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. హేమ కమిటీని నివేదికలో వివరించిన సిఫార్సులు మరియు పరిష్కారాలను మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తాము అలాగే మద్దతు ఇస్తున్నాము. వాటిని అమలు చేసేందుకు సినీ పరిశ్రమలోని అన్ని సంఘాలు తేడా లేకుండా చేతులు కలపాల్సిన సమయం ఆసన్నమైంది. వచ్చిన ఫిర్యాదులపై పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది.
జస్టిస్ హేమ కమిటీ నివేదిక పూర్తి వెర్షన్ కోర్టు ముందు ఉంది. పోలీసులు నిజాయితీగా విచారణ చేయనివ్వండి. శిక్షలను కోర్టు నిర్ణయించనివ్వండి. సినిమాలో ‘పవర్‌హౌస్’ అనేదే లేదు. సినిమా అంటే అలాంటివి ఉండే ఫీల్డ్ కాదు. కమిటీ నివేదికలోని ఆచరణాత్మక సిఫార్సులను అమలు చేయాలని, చట్టపరమైన అడ్డంకులు ఉంటే అవసరమైన చట్టాన్ని రూపొందించాలని జస్టిస్ హేమ అభ్యర్థించారు. అంతిమంగా సినిమా బతకాలి అంటూ మమ్ముట్టి రాసుకోచ్చాడు.
മലയാള സിനിമാരംഗം ഇപ്പോൾ അഭിമുഖീകരിക്കുന്ന സംഭവവികാസങ്ങളാണ് ഈ കുറിപ്പിന് ആധാരം. അതേക്കുറിച്ച് അഭിനേതാക്കളുടെ സംഘടനയും …
Posted by Mammootty on Sunday, September 1, 2024