Operation Sindoor – Mammootty | జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి చర్యకు సంబంధించి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. పాకిస్థాన్ దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయగా.. ఇందులో 70 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. అయితే భారత సైన్యం చేసిన ఆపరేషన్‌పై ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. మేమంతా మీ వెంటే ఉంటామంటూ భారత సైన్యానికి మద్దతుగా పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా మలయాళ నటుడు మమ్ముట్టి కూడా ఈ ఘటనపై ఎక్స్ వేదికగా స్పందించాడు.
నిజమైన హీరోలకు వందనం! దేశం పిలిచినప్పుడు భారతసైన్యం వస్తుందని ఆపరేషన్ సింధూర్ మరోసారి రుజువు చేసింది. ప్రాణాలను కాపాడినందుకు, ఆశను నిలిపినందుకు మీకు ధన్యవాదాలు. మీరు దేశాన్ని గర్వపడేలా చేశారు. జై హింద్! అంటూ మమ్ముట్టి రాసుకోచ్చాడు.
Salute to our Real heroes !#OperationSindoor proved again , When the nation calls, The #IndianArmy answers.
Thank you for saving lives and restoring hope.You Make The Nation Proud. Jai Hind !
— Mammootty (@mammukka) May 7, 2025