Malvi Malhotra | టాలీవుడ్లో రాజ్‌తరుణ్-లావణ్య వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. తిరగబడరాసామి సినిమా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కారణంగానే తనను రాజ్‌తరుణ్ వదిలేశాడని నార్సింగి పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలపై మాల్వీ మల్హోత్రా స్పందించింది. తనకు రాజ్‌తరుణ్‌తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.
తనపై లావణ్య తప్పుడు ఆరోపణలు చేస్తోందని మాల్వీ మల్హోత్రా తెలిపింది. రాజ్‌తరుణ్ తనకు కేవలం సహ నటుడు మాత్రమేనని.. అతని గురించి తనకేమీ తెలియదని స్పష్టం చేసింది. లావణ్య చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే అని తెలిపింది. షూటింగ్ తర్వాత 6 నెలలు రాజ్‌తరుణ్‌తో టచ్‌లో లేనని మాల్వీ పేర్కొంది. రీసెంట్గా సినిమా ప్రమోషన్ కోసమే మాట్లాడానని చెప్పింది. రాజ్‌తరుణ్‌తో నటించిన ప్రతి హీరోయిన్ను లావణ్య అనుమానిస్తోందని చెప్పింది. ఈ క్రమంలోనే తనను కూడా అనుమానిస్తోందని తెలిపింది.
ఆ అనుమానంతోనే లావణ్య తనకు మెసేజ్‌లు, కాల్స్ చేసి టార్చర్ చేస్తోందని మాల్వీ ఆవేదన వ్యక్తం చేసింది. తన తల్లిదండ్రులకు కూడా ఫోన్లు చేసి టార్చర్ చేస్తోందని వాపోయింది. తన కుటుంబంలో లావణ్యను ఎవరూ బెదిరించలేదని చెప్పింది. లావణ్యే తమ కుటుంబాన్ని బెదిరించిందని తెలిపింది. లావణ్య అలా ఎందుకు చేస్తుందో తమకు అర్థం కావడం లేదని వాపోయింది. తన కుటుంబ పరువు తీస్తున్నందుకు లావణ్యపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొంది.
కాగా, రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. జ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తాము విడిపోవడానికి కారణం మాల్వీ మల్హోత్రా అని ఫిర్యాదులో పేర్కొంది. రాజ్ తరుణ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా దొరకకుండా చేస్తామని మాల్వీ, ఆమె సోదరుడు బెదిరించారని ఫిర్యాదు చేసింది లావణ్య. అయితే ఈ కేసులో పోలీసులు లావణ్యకే రివర్సులో 91 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చారు. రాజ్‌తరుణ్ మీద ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని నోటీసులో పేర్కొన్నారు.
రాజ్‌తరుణ్, మాల్వీ మల్హోత్రాతో పాటు మరికొందరిపై 4 పేజీలతో కూడిన కంప్లయింట్‌ను లావణ్య ఇచ్చిందని నార్సింగి పోలీసులు తెలిపారు. అయితే ఆ కంప్లయింట్ సరైన ఫార్మాట్లో లేదని.. తేదీలు, సమయం, ప్లేస్ వివరాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనిపై ఫోన్ కాల్స్, నోటీసులు ఇచ్చినా ఆమె సంప్రదించడం లేదని చెప్పారు. సాయంత్రంలోపు ఆమె నుంచి రెస్పాన్స్ రాకపోతే దీన్ని తప్పుడు ఫిర్యాదుగా పరిగణించే ఛాన్స్ ఉందని వివరించారు.
పదకొండేళ్లుగా రాజ్‌తరుణ్‌తో రిలేషన్షిప్లో ఉన్నా. గుడిలో కూడా పెళ్లి చేసుకున్నాం. కానీ తన సినిమాలో నటిస్తోన్న హీరోయిన్‌తో అఫైర్ పెట్టుకొని నన్ను వదిలేశాడు. 3 నెలల క్రితం రాజ్ తరుణ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు. రాజ్ తరుణ్‌ను వదిలేయకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారు. రాజ్ తరుణ్ నా ప్రపంచం..రాజ్ తరుణ్ నాకు కావాలి. నాకు న్యాయం చేయాలి. గతంలో తనను డ్రగ్స్ కేసులో కావాలనే ఇరికించారని లావణ్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసులో అరెస్టై 45 రోజులు జైల్లో ఉన్నానని.. ఆ సమయంలో రాజ్ తరుణ్ తనకెలాంటి సాయం చేయలేదని పేర్కొంది లావణ్య.
అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజ్ తరుణ్.. లావణ్యను నేను మోసం చేసిన మాట అవాస్తవం. లావణ్యతో నేను ఇంతకుముందు రిలేషన్లో ఉన్నాను. కానీ లావణ్య డ్రగ్స్ వాడడం మొదలుపెట్టింది. అదే కాకుండా వేరే అబ్బాయితో లావణ్య రిలేషన్షిప్లో ఉంది. కన్న తండ్రిని కూడా లావణ్య మోసం చేసింది. ఇంట్లో ఉంటునే నన్ను టార్చర్ పెట్టింది. అందుకే లావణ్య టార్చర్ భరించలేకపోయా.. లావణ్యను నేను మోసం చేయలేదు. తానే నన్ను మోసం చేసింది. అందువలనే నేను జీవితంలో పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నా అంటూ రాజ్ తరుణ్ వెల్లడించాడు.