Vishwambhara | టాలీవుడ్ స్టార్ యాక్టర్ చిరంజీవి (Chiranjeevi) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి విశ్వంభర (Vishwambhara). బింబిసార ఫేం వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. అమిగోస్ ఫేం ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా డైరెక్టర్ వశిష్ఠ చిరంజీవి, ఎంఎం కీరవాణికి ధన్యవాదాలు తెలుపుతూ వారితో దిగిన ఫొటోను షేర్ చేశాడు. మ్యూజిక్ సిట్టింగ్స్ గురించి తెలియజేస్తూ.. ప్రేక్షకుల కోసం మీరు, కీరవాణి రెడీ చేసిన రషెస్ కోసం ఎదురుచూస్తున్నట్టు తన ఎక్జయిట్‌మెంట్‌ను తెలియజేశాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తుండగా.. మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ విక్రమ్ తెరకెక్కిస్తుండగా.. ఆర్ఆర్ఆర్ ఫేం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం అందిస్తున్నారు. విశ్వంభర టైటిల్ లుక్, కాన్సెప్ట్ వీడియో మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. విశ్వంభర వీఎఫ్ఎక్స్ పార్ట్ ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతుందట.
#Vishwambhara Music 💥 pic.twitter.com/Wy4wacyIdP
— Rajesh Manne (@rajeshmanne1) January 28, 2025
విశ్వంభర కాన్సెప్ట్ వీడియో..
Apsara Rani | సినిమాలు వదిలేయాలనుకున్నా.. రాచరికం ఈవెంట్లో అప్సర రాణి