నరేష్ వీకే, పవిత్ర లోకేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘మళ్లీ పెళ్లి’. జయసుధ, శరత్ బాబు, అనన్య నాగళ్ల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ వీకే నిర్మిస్తున్నారు. తెలుగు, కన్నడ ద్విభాషా చిత్రంగా దర్శకుడు ఎంఎస్ రాజు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ఈ నెల 13న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం శనివారం వెల్లడించింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఎంఎన్ బాల్‌రెడ్డి, సంగీతం : సురేష్ బొబ్బిలి.