Malavika Mohanan | ‘ఇంటిమేట్ ముద్దు సన్నివేశాల్లో నటించడం తేలికైన విషయం కాదు. దానికి నటించే ఇద్దరి మధ్య సరైన అవగాహన, అనుబంధం ఉండాలి. చుట్టూ సౌకర్యవంతమైన వాతావరణం ఉండాలి. అప్పటికీ అది చేయడం కష్టమే.’ అంటూ ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది అందాలభామ మాళవిక మోహనన్. ఈ కేరళ బ్యూటీ ‘యుధ్రా’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నది.
ఈ సినిమాలోని ఓ పాటలో కథ డిమాండ్ మేరకు ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించింది మాళవిక. ఆ సన్నివేశాలు చేస్తున్నప్పుడు తను పడ్డ అంతర్మథనం గురించి ఆమె తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘ఈ సినిమాలో ‘సాథియా..’ అంటూ సాగే పాటను స్పైసీగా డిజైన్ చేశారు దర్శకుడు రవి ఉద్యావర్. ఈపాటలో ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఇలాంటి పాటలు తీసేటప్పుడు లొకేషన్లో అందర్నీ ఉండనివ్వరు.
ఆ సన్నివేశాల కోసం ప్రత్యేకంగా ఇంటిమేట్ కో-ఆర్డినేటర్‌ను నియమిస్తారు. తను నటీనటులు ఇబ్బంది పడకుండా, ఆ సన్నివేశాల్లో ఎలా నటించాలో చెబుతుంటాడు. కానీ మా లొకేషన్లో అలాంటి కో-ఆర్డినేటర్ ఎవరూ లేరు. ‘సాథియా..’ పాట గురించి తెలుసుకొని హీరో సిద్ధార్థ్ చతుర్వేది, నేను కంగారుపడిపోయాం.
అసలు ఈ పాట చేయగలమా? అని సందేహించాం కూడా. సముద్రతీరం.. అందునా భయంకరమైన చలి. ఇక తప్పేది లేక, కాస్త కష్టమైనా దర్శకుడు రవి ఉద్యావర్ చెప్పినట్టు చేసి, పాటను పూర్తి చేశాం. అయితే.. ఈ పాటలో ఎక్కడా అసభ్యత ఉండదు. కళాత్మకంగా ఉంటుంది.’అంటూ చెప్పుకొచ్చింది మాళవిక మోహనన్