తెలుగులో రెండుమూడేళ్ల క్రితమే ఆఫర్లు వచ్చినా.. సాలిడ్ ఎంట్రీ కోసం ఇన్నాళ్లూ ఆలస్యం చేస్తూ వచ్చింది మలయాళమందారం మాళవిక మోహనన్. ఎట్టకేలకు ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నది ఈ అందాలభామ. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కానుంది. ఇదిలావుంటే.. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మాళవిక మోహనన్.. తన అందమైన ఫొటోలను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ ఫొటోలను చూసిన అభిమానులు రొమాంటిగ్గా స్పందిస్తుంటారు.
రీసెంట్గా అభిమానులతో తాను జరిపిన ఓ చిట్‌చాట్‌లో మాళవికను ఓ అభిమాని ‘నన్ను పెళ్లాడవచ్చుకదా..’ అనడిగాడు.. దానికి ఆమె స్పందిస్తూ.. ‘నాకు దెయ్యాలంటే భయం.. దెయ్యాలను నేను పెళ్లాడను’ అని సమాధానమిచ్చింది. తనలా ఎందుకు స్పందించిందా! అని అందరూ జుట్టు పీక్కున్నారు. తీరా చూస్తే.. ఆ అభిమాని తన అకౌంట్‌కి తన పేరును కాకుండా ‘ఘోస్ట్’ అని పేరు పెట్టుకున్నాడు.
అందుకే ‘దెయ్యాలను నేను పెళ్లాడను’ అంటూ ఫన్నీగా స్పందించింది మాళవిక మోహనన్. ఇలా అందమైన ఫొటోలను పోస్ట్ చేయడం, ఆ ఫొటోలను చూ సి ఫిదా అయిన అభిమానులు ఆమెకు ‘ఐలవ్యూ’ అంటూ కామెం ట్లు పెట్టడం ఆ కామెంట్లకు మాళవిక సరదాగా స్పందించడం ఇవన్నీ మామూలే.