Malavika Mohanan | ‘కొత్త పరిశ్రమ, కొత్త భాష అనగానే కాస్త కంగారు పడ్డా. అయితే.. నిదానంగా అలవాటు పడ్డా. కొత్త నగరంలో కొత్త సంస్కృతిని ఆకళింపు చేసుకున్నా. ముఖ్యంగా తెలుగు భాషపై ఇష్టం, ఆసక్తి రెండూ పెరిగాయి. ఆ పదాలు పలికే విధానం, శబ్ధం నాకు నచ్చాయి.’ అంటున్నది కేరళ కుట్టి మాళవిక మోహనన్. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ గురించి ఆమె మాట్లాడింది.
అందులో తన పాత్ర గురించీ, అనుభవాల గురించి ఆసక్తికరంగా వెల్లడించింది. “ది రాజాసాబ్’ హారర్ కామెడీ మూవీ. ఇప్పటివరకూ నేను చేయని జోనర్. చాలా సినిమాల్లో హీరో పాత్ర ఎదిగే కొద్దీ స్త్రీ పాత్ర తగ్గిపోతూవుంటుంది. కానీ ‘ది రాజాసాబ్’లో అలాకాదు. ఇందులో ఆద్యంతం నా పాత్ర బలమైనదే. అద్భుతమైన సన్నివేశాల్లో నటించాను.
‘బాహుబలి’ నుంచి ప్రభాస్‌కి నేను పెద్ద ఫ్యాన్. ఆయనతో కలిసి పనిచేయాలని కలలు కన్నా. సెట్లో ఆయన్ను చూసి ఆశ్చర్యపోయా. అంతపెద్ద స్టార్ చాలా నార్మల్‌గా ఉంటారు. సపోర్టివ్ కూడా. ఆయన ఉన్న ప్రదేశాన్నంతా కంఫర్టబుల్‌గా మార్చేస్తారు. మనతో సరదాగా గడుపుతారు. సెట్లో ఉన్న టీమ్ మొత్తానికీ మంచి ఫుడ్‌ని పంపిస్తారు. దగ్గరుండి బిర్యాని తినిపిస్తారు.. కామెడీ టైమింగ్‌తో నవ్విస్తారు. నిజంగా ప్రభాస్ చాలా స్వీట్.’ అంటూ తెగ పొగిడేసింది మాళవిక మోహనన్.