‘హీరోయిన్గా కెరీర్‌ని సాగించడం తేలిక కాదు. దానికి కఠోర శ్రమ చేయాలి. కడుపు మాడ్చుకోవాలి. జిమ్‌లో గంటల తరబడి గడపాలి. హీరోయిన్ని ఎంచుకోవడంలో ఒక్కో ఇండస్ట్రీదీ ఒక్కో అభిరుచి. బాలీవుడ్లో సన్నగా ఉండాలి. సౌత్ సినిమా అంటే బొద్దుగా ఉండాలి. రెండు ఆఫర్లూ ఒకేసారి వస్తే ఏదో ఒకటి వదులుకోవాల్సిందే.’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నటి మాళవిక మోహనన్.
‘కెరీర్ తొలి నాళ్లల్లో ఫిజిక్ విషయంలో గందరగోళానికి గురయ్యా, బొద్దుగా ఉండాలా? సన్నగా ఉండాలా? అనే ప్రశ్నలు నెలలపాటు నన్ను వెంటాడాయ్. మెల్లగా పరిస్థితులు అర్థమయ్యాయి. దాంతో ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని నిర్ణయించుకున్నా.’ అని తెలిపింది మాళవిక. ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ ‘ది రాజాసాబ్’తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న విష యం తెలిసిందే.