మలైకా అరోరా.. స్టన్నింగ్ లుక్స్, డ్రెస్సింగ్ స్టయిల్, రిలేషన్షిప్ ఇలా ప్రతి విషయంలోనూ సెన్సేషన్‌కు కేరాఫ్‌గా కనిపిస్తుంది. ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీ.. కొన్నిరోజులుగా నిత్యం వార్తల్లోనే నిలుస్తున్నది. ఆమె గురించి నెట్టింట నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో.. ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి పోస్ట్ పెట్టింది మలైకా. ‘మీలో కలిగే ప్రతి సానుకూల ఆలోచన.. ఓ నిశ్శబ్ద ప్రార్థనే! అది మీ జీవితాన్ని మార్చేయగలదు. శుభోదయం!’.. అంటూ రాసుకొచ్చింది. మరో స్టోరీలో.. ‘మీ హృదయాన్ని ఒక్క క్షణంపాటు తాకడమంటే.. ఒక ఆత్మను జీవితకాలంపాటు స్పృశించడమే..’ అంటూ ఓ సందేశాత్మక పోస్ట్‌ను అభిమానులతో పంచుకున్నది. అంతకుముందే.. తన సినిమా ప్రమోషన్లలో భాగంగా, తాను నిజంగానే ఒంటరిగా ఉన్నానని చెప్పుకొచ్చాడు అర్జున్ కపూర్.
మలైకాతో తాను విడిపోయినట్లు చెప్పకనే చెప్పాడు. ఈ మాటలను ఉద్దేశించే.. మలైకా ఈ పోస్ట్ పెట్టిందని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్లో ఐటమ్ సాంగ్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలైకా.. సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను 1998లో పెళ్లి చేసుకున్నది. వ్యక్తిగత కారణాల వల్ల 2017లో విడాకులు తీసుకున్నది. ఏడాది లోపే తనకంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. తాజాగా.. వీరిద్దరూ విడిపోయారంటూ సోషల్ మీడియాలో రచ్చ సాగుతున్నది.