సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటిస్తున్న ప్రేమకథాచిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకుడు. అజయ్కుమార్రాజు నిర్మాత. త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘నాలో నేను..’ అంటూ సాగే గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను ఆదిత్య రవీంద్రన్ స్వరపరచగా, సంజిత్ హెగ్డే ఆలపించారు. ‘నాలో నేను.. తనలో తాను.. కలిసే ఉన్నాం విడిగా.. కాలమా కాలమా ఈవేళని తెల్లవారనీకమ్మా.. దూరమా దూరమా రెప్పపాటులో మాయమై పోమ్మా.. ఇందాకా చేరుకుంది ఇందుకేనా.. ఇంతేనా కాలమంతా మౌనమేనా..’ అంటూ మెలొడియస్గా ఈ పాట సాగింది. ఈ చిత్రానికి కెమెరా: దినేష్ పురుషోత్తమన్.