సోమవారం 25 మే 2020
Cinema - Mar 15, 2020 , 09:51:03

క‌రోనా వ‌ల‌న ప్లాన్స్ ఫ్లాప్: అడివి శేష్‌

క‌రోనా వ‌ల‌న ప్లాన్స్ ఫ్లాప్: అడివి శేష్‌

క్షణం, గూఢచారి చిత్రాలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న అడివి శేష్  ‘మేజర్’ అనే భారీ చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇండియాలో ప్ర‌ముఖ నిర్మాణ‌, పంపిణీ సంస్థ సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్, టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు నిర్మాణ సంస్థ జి మ‌హేష్‌బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్ క‌ల‌యిక‌లో `మేజ‌ర్` అనే భారీ చిత్రం రూపొందుతుంది.  ద్విభాషా చిత్రంగా తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రం  26/11 ముంబై దాడుల్లో త‌న ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఎంద‌రో ప్రాణాల‌ను కాపాడిన ఎన్‌.ఎస్‌.జి క‌మెండో మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ జీవిత‌మాధారంగా తెర‌కెక్కిస్తున్నారు.

ఈ రోజు ఉన్ని కృష్ణ‌న్ జ‌యంతి కాగా, ఆయ‌న జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని మేజ‌ర్ చిత్రం నుండి బిగ్ అనౌన్స్‌మెంట్ ఇద్దామ‌ని ప్లాన్ చేశారు మేక‌ర్స్. కాని కోవిడ్ 19 వ‌ల‌న దీనిని వాయిదా వేశాం. కాని మన సైనికుల త్యాగాన్ని ఎప్పటికీ మ‌ర‌చిపోకండి . జై హింద్ అని అడివి శేష్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశాడు. గూఢ‌చారి ద‌ర్శ‌కుడు శ‌శికిర‌ణ్ తిక్క ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. 


logo