
మహేశ్ బాబు-విజయ్ దేవరకొండ..తెలుగు సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోలు. ఈ ఇద్దరు హీరోలు అరుదైన గౌరవం దక్కించుకున్నారు. మహేశ్, విజయ్ హలో మ్యాగజైన్ పవర్ లిస్ట్ 2021లో చోటు సంపాదించారు. సొసైటీలో తమ ఉనికిని చాటుకున్న సెలబ్రిటీల జాబితాను హలో మ్యాగజైన్ పవర్ లిస్ట్ పేరుతో ప్రతీ యేటా విడుదల చేస్తుంది. మహేశ్ బాబు బాలనటుడి నుంచి టాలీవుడ్ సూపర్ స్టార్ గా మారిన వైనం ఆకట్టుకుంటుంది అని హలో మ్యాగజైన్ పేర్కొంది.
ఇండస్ట్రీకి మంచి హిట్స్ ఇచ్చి..ప్రస్తుతం కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాతలతో పనిచేస్తున్న విజయ్ దేవరకొండ ను మ్యాన్ విత్ ఎ మిడాస్ టచ్ గా అభివర్ణించింది. ప్రస్తుతం హిందీలో పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వస్తున్న లైగర్ చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక మహేశ్ బాబు ప్రస్తుతం పరశురాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.
. @TheDeverakonda gets a spot in the Power List 2021 curated by Hello!Magazine. Vijay Devarakonda and @urstrulyMahesh spotted! #VijayDeverakonda @HELLOmag pic.twitter.com/embkF258Cf
— Rajasekar (@sekartweets) July 20, 2021
ఇవి కూడా చదవండి..
నారప్పలో ఆ విషయం వివాదమయ్యేనా?
నటి కరీనా కపూర్ పుస్తకం ‘ప్రెగ్నెన్సీ బైబిల్’పై ఫిర్యాదు
నటి ఖుష్బూ ట్విటర్ అకౌంట్ మళ్లీ హ్యాక్
రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్.. వీడియోలు ఎక్కడ తీశారు? ఎలా అప్లోడ్ చేశారు?