Neeraj Chopra: నీరజ్ చోప్రా మడిమకు గాయం.. ఆసియా గేమ్స్‌కు దూరం
Neeraj Chopra: జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మడిమకు గాయమైంది. దీంతో వచ్చే నెలలో జరగనున్న ఆసియా క్రీడలకు అతను కానున్నాడు. లౌసానే లీగ్ తర్వాత శిక్షణ సమయంలో గాయమైనట్లు పేర్కొన్నాడు. రికవరీపై ఫోకస్ పెట్టిన తాను ఈ సీజన్ మొత్తం ఆటకు దూరంకానున్నట్లు చెప్పాడు.
న్యూఢిల్లీ: జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra)కు గాయమైంది. కాలి మడిమ వద్ద గాయమైనట్లు అతను పేర్కొన్నాడు. దీంతో వచ్చే నెలలో జరగనున్న ఆసియా క్రీడలకు నీరజ్ దూరం కానున్నాడు. రెండు సార్లు ఒలింపిక్ మెడల్ గెలిచిన నీరజ్ .. ఈసారి ఆసియా క్రీడలకు లేకపోవడం భారత బృందానికి నిరాశే అవుతుంది. తన గాయం నుంచి నీరజ్… సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. లౌసానే డైమండ్ లీగ్ తర్వాత ప్రాక్టీస్ సమయంలో మడిమకు లింగమెంట్ టియర్ అయినట్లు అతను తెలిపాడు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ మూమెంటం వచ్చినట్లు భావించానని, లౌసానేలో సీజన్ బెస్ట్ త్రో వేయాలని భావించనన్నారు. అయితే ట్రైనింగ్ సమయంలో మడిమ గాయమైందని, డాక్టర్లు, తన టీమ్‌తో చర్చించిన తర్వాత ఇక ఈ సీజన్ నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయినట్లు చెప్పాడు.
ఇది నిరాశ కలిగించే అంశమే కానీ, క్రీడల్లో ఇదంతా భాగమే అన్నారు. రికవరీపైనే ఇప్పుడు తాను ఫోకస్ పెట్టినట్లు నీరజ్ చెప్పారు. మరింత దృఢంగా మళ్లీ రానున్నట్లు తెలిపాడు. ఈ సీజన్ మొత్తం దూరం కావడం అంటే, అతను డైమండ్ లీగ్ ఫైనల్ కూడా మిస్‌కానున్నాడు. వాస్తవానికి ఆ మీట్‌కు అతను క్వాలిఫై అయ్యాడు. ఇక ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభంకానున్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

