SSMB29 | బాహుబలి ప్రాంఛైజీ, ఆర్ఆర్ఆర్ సినిమాలతో గ్లోబల్ స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఈ రెండు సినిమాలు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాల రేంజ్‌ను మరోసారి చాటి చెప్పాయి. పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ తర్వాత టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) తో చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రాబోతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
తాజాగా ఈ సినిమా ఎప్పుడు లాంఛ్ కాబోతుందన్న దానిపై ఓ ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ ఓపెనింగ్ సెర్మనీ ఏప్రిల్‌లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జక్కన్న కుమారుడు ఎస్ఎస్ కార్తికేయ సోషల్ మీడియాలో ఓ హింట్ వదిలాడు. దీంతో సూపర్ స్టార్ ఇక త్వరలోనే గ్లోబల్ అడ్వెంచరస్ మూవీని లాంఛ్ చేయబోతున్నాడని ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు అభిమానులు, మూవీ లవర్స్. విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad) కథనందిస్తున్న ఈ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.
జక్కన్న, మహేశ్‌బాబు మిక్స్డ్ స్టిల్‌తో.. క్యాప్షన్ లేదు.. ఫొటో చాలా మాట్లాడుతుంది.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కొనసాగుతోంది.. అంటూ చాలా రోజుల క్రితం ఇచ్చిన అప్డేట్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. యాక్షన్ డ్రామా నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో రాబోతున్న ఈ మూవీలో పాపులర్ హాలీవుడ్ యాక్టర్‌తోపాటు వరల్డ్‌వైడ్‌గా ఉన్న స్టార్ యాక్టర్లను తీసుకోనున్నాడట. జక్కన్న కాంపౌండ్ నుంచి వస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ కోసం రామోజీఫిలిం సిటీలో ఏకంగా రూ.100 కోట్ల ఖర్చుతో భారీ సెట్లో షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు కూడా తెరపైకి వచ్చాయి.
Jakkanna Son SS Karthikeya Hint Abt #SSMB29 Grand Opening May On This Month Mostly 🔥🔥🔥
GLOBAL-TROTTING 🌍 🦁#MaheshBabu #Rajamouli #MMKeeravani #VijayendraPrasad #KLNarayan pic.twitter.com/ZFl6BbT9Jj
— heyopinions (@heyopinions) April 1, 2024
ఎస్ఎస్ఎంబీ 29 నయా అప్డేట్..
No Caption… Picture speaks a lot !!
ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.#SSMB29 🔥 pic.twitter.com/3BEV10srNS
— Rajesh Manne (@rajeshmanne1) January 23, 2024