Varanasi | తెలుగుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29. ఇవాళ రామోజీఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో టైటిల్ లాంచ్ చేశారు. ఈ చిత్రానికి అంతా అనుకున్నట్టుగా వారణాసి టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ చిత్రానికి ముందుగా వచ్చిన కథనాల ప్రకారం వారణాసి టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
మహేశ్ బాబు త్రిశూలాన్ని చేతపట్టుకుని ఎద్దు (నంది)పై స్వారీ చేస్తున్న విజువల్స్‌తో వారణాసి టైటిల్‌ను అనౌన్స్ చేసింది జక్కన్న టీం. ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఆధ్మాత్మిక ప్రదేశం వారణాసినే టైటిల్‌గా పెట్టి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాడు ఎస్ఎస్ రాజమౌళి. బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడం గ్యారంటీ అని మహేశ్ బాబు గ్రాండ్ ఎంట్రీ చెప్పకనే చెబుతోంది.
ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. మాలీవుడ్ స్టార్ యాక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రాన్ని 2027, 2029లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా జక్కన్న టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
నెట్టింట వారణాసి టైటిల్ గ్లింప్స్ విజువల్స్..
Title out! #SSMB29 named #Varanasi. 🔥 pic.twitter.com/IWsGbXOkTf
— Abinesh (@AbineshWorld) November 15, 2025
Mahesh Babu in absolute beast mode! 🤯🔥#GlobeTrotter | #SSMB29 pic.twitter.com/J9jikLW0cL
— Abinesh (@AbineshWorld) November 15, 2025
🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥🔥#Varanasi pic.twitter.com/E4IZ16Gmdv
— SK (@intiki_chinnodu) November 15, 2025
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!
Bala Krishna | అఖండ 2 టైటిల్ సాంగ్ లాంచ్ ఈవెంట్లో బాలయ్య సందడి .. హిందీ స్పీచ్ , తమన్‌తో సరదా
Dining With The Kapoors | కపూర్ ఫ్యామిలీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ట్రైలర్ చూశారా.!