మహేష్‌బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండున్నరేళ్ళు దాటింది. ఎప్పుడెప్పుడు ఈయన నుంచి సినిమా వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అభిమానుల నిరీక్షణకు ఫలితంగా గురువారం ఈ చిత్రం విడుదల కానుంది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలున్నాయి. ఇక చిత్ర బృందం నాన్ స్టాప్‌గా ప్రమోషన్లను చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రమోషన్లలో భాగంగా మహేష్ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఈ క్రమంలోనే తన నెక్ట్స్ చిత్రం గురించి చెప్పుకొచ్చాడు.
మహేష్‌బాబు తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నాడు. గతంలో వీళ్ళ కాంబోలో తెరకెక్కిన ‘అతడు’, ‘ఖలేజా’ మంచి విజయాలు సాధించాయి. ఇప్పటికి ఈ రెండు చిత్రాలు టీవిలో మంచి టీఆర్పీ నమోదు చేస్తాయి. ముచ్చటగా మూడోసారి వీరిద్దరు కలిసి సినిమా చేయడంతో ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. కాగా తాజాగా జరిగిన ఇంటర్వూలో మహేష్.. త్రివిక్రమ్‌తో పనిచేయడం చాలా కొత్తగా ఉంటుంది అంటూ త్రివిక్రమ్ గురించి చెప్పుకొచ్చాడు. ఇటీవలే లాంఛ్ అయిన ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనుంది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని చినబాబు నిర్మిస్తున్నాడు.