సైదాబాద్ హత్యాచార ఘటన ఎంత మందిని కలిచివేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిని రాజు అనే కీచకుడు హత్యాచారం చేశాడు. అతడిని ఎన్కౌంటర్ చేయాలని, బహిరంగంగా ఉరి తీయాలనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా సీపీ అంజనీ కుమార్ అతడిని పట్టించిన వారికి పది లక్షల రివార్డ్ అందిస్తామని ప్రకటించారు.అలానే అతను ఏ పోలికలతో ఉంటారో కూడా తెలియజేశారు.
చిన్నారి మృతితో ఆ కుటుంబం బాధ వర్ణనాతీతం. మంగళవారం రోజు మంచు మనోజ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు .అలాంటి రాక్షసుడిని వెంటనే ఉరి తీయాలి.. ఎక్కడున్నా వాడిని పట్టించాలని అందరినీ మంచు మనోజ్ కోరాడు. ఇక మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ నిందితుడిని త్వరగా పట్టుకొని బాధితులకి తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరాడు.
ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణం మన సమాజంలో పరిస్థితులు ఎంతగా దిగజారాయో తెలియజేస్తుంది. అసలు మన బిడ్డలు సురక్షితమేనా? అన్నది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోవాలా! చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఖంలో మునిగిపోయిందో ఊహించలేకపోతోన్నా.చిన్నారికి, కుటుంబ సభ్యులకు తగిన న్యాయం జరిగేలా చూడలని అధికారులని కోరుతున్నాను అని మహేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
I urge the authorities to ensure swift action and deliver justice to the child and her family! 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) September 14, 2021