Parasuram | పరశురాం మేకింగ్ తో ఇబ్బంది పడుతున్న మహేశ్ బాబు..?
టాలీవుడ్ (Tollywood) లో తెరకెక్కుతున్న క్రేజీయెస్ట్ ప్రాజెక్టులో ఒకటి సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). పరశురాం ( Parsuram), సూపర్ స్టార్ మహేశ్ బాబు ( Mahesh Babu )క్రేజీ కాంబో సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి.

టాలీవుడ్ (Tollywood) లో తెరకెక్కుతున్న క్రేజీయెస్ట్ ప్రాజెక్టులో ఒకటి సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata). గీత గోవిందం లాంటి బ్లాక్ బాస్టర్ హిట్ ను తెలుగు ప్రేక్షకులకు అందించిన పరశురాం ( Parasuram), సూపర్ స్టార్ మహేశ్ బాబు ( Mahesh Babu )కాంబినేషన్ లో ఈ చిత్రం వస్తోంది. ఈ క్రేజీ కాంబో సినిమాపై ప్రేక్షకుల్లో భారీగానే అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ విషయంలో పరశురాం ఎక్కువ సమయం తీసుకుంటున్నాడట. ముందుగా ప్లాన్ చేసిన కీలక సీన్లు కాకుండా ఇప్పటివరకు కేవలం సర్కారు వారి పాట చిన్న షెడ్యూల్ మాత్రమే పూర్తి చేశాడట పరశురాం.

ఇక పరశురాం ఇలా నెమ్మదిగా షూటింగ్ చేస్తుండటంతో మహేశ్ బాబు ఇబ్బంది పడుతున్నట్టుగా ఫిలింనగర్ సర్కిల్ లో జోరుగా టాక్ వినిపిస్తోంది. నిర్మాతలు ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేసేందుకు టైం ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో పరశురాం చిత్రీకరణ నెమ్మదించడంతో ఓవైపు మహేశ్, మరోవైపు నిర్మాతలు ఇబ్బంది పడుతున్నట్టు జోరుగా చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఏది ఏమైనా 2022 సంక్రాంతికి మాత్రం సినిమాను విడుదల చేయాలన్నదే మహేశ్బాబు సెంటిమెంట్.
సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలకు ఆదరణతోపాటు కలెక్షన్లు కూడా బాగుంటాయని తెలిసిందే. గతేడాది సరిలేరు నీకెవ్వరు కూడా సంక్రాంతికే విడులైన విషయం తెలిసిందే. మహేశ్ డైరెక్టర్ యాక్టర్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్కసారి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటే ఆ డైరెక్టర్ పైనే పూర్తి నమ్మకాన్ని పెట్టుకుని ముందుకెళ్తాడు. అంతేకాదు సినిమా కూడా అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు రెడీగా ఉంటాడు. ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇవికూడా చదవండి..
Lovestory| లవ్ స్టోరీ మేకర్స్ ను వెంటాడుతున్న స్పెల్లింగ్ మిస్టేక్..!
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

