బుధవారం 30 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 09:02:47

మ‌హేష్‌కి వ‌ర‌ల్డ్ రికార్డ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చిన ఫ్యాన్స్

మ‌హేష్‌కి వ‌ర‌ల్డ్ రికార్డ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చిన ఫ్యాన్స్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఆదివారం త‌న 45వ బ‌ర్త్‌డేని జ‌రుపుకున్నాడు. మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న‌కి అభిమానులు, ప‌లువురు ప్ర‌ముఖుల నుండి శుభాకాంక్ష‌ల వెల్లువ కురిసింది. 24 గంట‌ల‌లో హెచ్‌బీడీమ‌హేష్‌బాబు అనే ట్యాగ్‌తో 60.2 మిలియ‌న్ ట్వీట్స్ వ‌చ్చాయి. ఇది వ‌ర‌ల్డ్ రికార్డ్ అని చెబుతున్నారు. గ‌త రికార్డులు అన్నీ బ్రేక్ అయ్యేలా మ‌హేష్ ఫ్యాన్స్ బ‌ర్త్‌డే ట్యాగ్‌ని ఫుల్‌గా ట్రెండ్ చేసి త‌మ అభిమాన హీరోకి అదిరిపోయే బ‌ర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు.

మ‌హేష్ కూడా త‌న అభిమానుల‌కి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. స‌ర్కారు వారి పాట‌ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల చేసి ప్రేక్ష‌కులలో ఆనందాన్ని క‌లిగించాడు. ఈ చిత్రం ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, చిత్రం మొత్తం మ‌నీ చుట్టూ తిరుగుతుంద‌ని తెలుస్తుంది. అతి త్వ‌ర‌లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

తాజావార్తలు


logo