టాలీవుడ్ (Tollywood)లో మరోసారి మహేశ్ బాబు (Mahesh Babu)-త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబినేషన్ సందడి మొదలైంది. ఎస్ఎస్ఎంబీ 28 (SSMB28) చిత్రీకరణ ఆగస్టులోమొదలు కానుందని ఇప్పటికే అదిరిపోయే అప్ డేట్ బయటకు వచ్చింది. కాగా ఇపుడు ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త ఫిలినగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. త్రివిక్రమ్ ప్రాజెక్టు కోసం మహేశ్ ఎన్ని రోజులు కాల్షీట్లు ఇచ్చాడో తెలుసా..?
లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ చిత్రానికి 100 రోజులు కేటాయించాడట. అంటే 3 నెలల 10 రోజులన్నమాట. ఈ లెక్కన షార్ట్ టైంలోనే మహేశ్ షూటింగ్ పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా మహేశ్ షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఒక్కసారి ఈ సినిమా అయిపోయిందంటే..రాజమౌళితో చేయబోయే సినిమా కోసం మహేశ్ రెడీగా ఉన్నట్టే లెక్క.
అన్నీ అనుకున్నట్టుగా ప్లాన్ ప్రకారం జరిగితే వచ్చే ఏడాది ప్రారంభంలోనే జక్కన్న సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లినా ఆశ్చర్యపోనవసరం లేదని తాజా అప్ డేట్ చెబుతోంది. మొత్తానికి మహేశ్ కాల్షీట్లకు సంబంధించిన అప్డేట్ రావడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు అభిమానులు. ఈ చిత్రంలో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.