Mahesh Babu-Trivikram Project | సినీరంగంలో ఒక సినిమా మంచి విజయం సాధిస్తే మళ్ళీ ఆ హీరో, దర్శకుడు కలిసి సినిమా చేయాలని ఆసక్తి చూపుతుంటారు. ప్రేక్షకులలో కూడా మళ్ళీ వీళ్ళ కాంబోలో సినిమా వస్తే బావుంటుంది అని అనుకుంటుంటారు. ఒకవేళ ఆ కాంబోలో సినిమా సెట్టయిందంటే ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడుతుంటాయి. టాలీవుడ్లో అలాంటి కాంబినేషన్లలో మహేష్, త్రివిక్రమ్ కాంబో ఒకటి. వీళ్ళ నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకులే కాదు, సినీప్రముఖులు కూడా ఎదురు చూస్తుంటారు. ప్రేక్షకుల నిరీక్షణకు ఫలితంగా వీళ్ళు మూడోసారి కలిసి పనిచేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. ఇక రీసెంట్‌గానే ఫిబ్రవరిలో ఈ చిత్ర లాంఛనింగ్ కార్యక్రమాలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టనుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ హీరో అనీల్ కపూర్ నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో సమాచారం. ఇప్పటికే చిత్రం బృందం అనీల్ కపూర్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పాన్ ఇండియా లెవల్లో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట. ఇక బాలీవుడ్లో అనీల్ కపూర్‌కు మంచి క్రేజ్ ఉంది. ఆయన క్రేజ్ ఈ సినిమాకు బాలీవుడ్లో ప్లస్ అవుతుందని భావించి మేకర్స్ అనీల్ కపూర్‌తో చర్చలు జరిపారట. ఈ చిత్రంలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.