గ్లోబ్ ట్రాటర్ వేడుక తర్వాత ‘రాజమౌళి వారణాసి’ సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ అంతకు పదింతలైంది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ఆడియన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వివరాల్లోకెళ్తే.. ఇందులో మహేశ్ ‘రుద్ర’గా, శ్రీరామచంద్రుడిగా కనిపిస్తారని గ్లోబ్ ట్రాటర్ వేడుకలో రాజమౌళి చెప్పారు. రుద్ర గెటప్‌ని రివీల్ చేశారు కూడా. ఇక చూడాల్సింది రాముడి రూపం మాత్రమే అని అంతా అనుకుంటున్న తరుణంలో.. ఇందులో మహేశ్‌బాబు మొత్తం 5 రూపాల్లో కనిపిస్తారట.
ఈ గెటప్పులు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉంటాయట. ఆ మిగిలిన మూడు గెటప్పులు ఏమై ఉంటాయి? అనే చర్చ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో నడుస్తున్నది. అప్పుడెప్పుడో చిన్నప్పుడు ‘కొడుకు దిద్దిన కాపురం’ సినిమాలో మహేశ్‌బాబు ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పుడు ‘రాజమౌళి వారణాసి’ సినిమాలో ఏకంగా అయిదు గెటప్పుల్లో కనిపించనున్నారు. ఈ వార్త నిజంగా ఆయన అభిమానులకు శుభవార్తే. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంగీతం: ఎం.ఎం.కీరవాణి, నిర్మాత: కె.ఎల్.నారాయణ, నిర్మాణం: దుర్గా ఆర్ట్స్.