Mahesh Babu | సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీతో ఏడాదికి రెండు మూడు సార్లు వెకేషన్‌కి వెళ్లడం కామన్. అయితే రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడు అనగానే మహేష్ బాబు ఇక మూడేళ్లపాటు పూర్తిగా లాక్ చేయబడతాడా అని అందరు అనుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పాస్ పోర్ట్ సీజ్ చేసినట్లు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఆ మధ్య ఒక వీడియో ద్వారా తెలియజేశాడు. దాంతో పాపం మహేష్‌కి కష్టాలు మొదలైనట్టే అని అందరు అనుకున్నారు. కాని మహేష్ బాబు అందరు హీరోల మాదిరిగా రాజమౌళి బోన్లో చిక్కలేదు.
గతంలో పిల్లలకు హాలిడేస్ ఇచ్చినప్పుడు ఫ్యామిలీతో కలిసి టూర్స్ వేసే అలవాటును మహేష్ బాబు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఒకవైపు షూటింగ్లో పాల్గొంటూనే మరోవైపు విదేశాలకి టూర్స్ వేస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఫ్యామిలీతో ఇటలీ వెళ్లిన మహేష్ బాబు త్వరలో మరోసారి ఫారెన్ టూర్ వేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎస్ఎస్ఎంబీ 29 మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రియాంక చోప్రాతో మహేష్ బాబు కాలు కదుపుతున్నట్టు తెలుస్తుండగా,… ఆ పాట చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే సమ్మర్ హాలిడేస్ తీసుకుంటున్నారని టాక్.
మహేష్ నమ్రత దంపతుల కుమార్తె సితార ఘట్టమనేనికి వేసవి సెలవులు ఇచ్చేశారు. కుమారుడు గౌతమ్ ఇప్పుడు విదేశాలలో చదువుతున్నారు. ఈ క్రమంలో మహేష్, నమ్రత, సితార అతని దగ్గరకి వెళతారని సమాచారం. నెల రోజుల పాటు మహేష్ బాబు ఇండియాలో ఉండరని ఫ్యామిలీతో కలిసి విదేశాలలో విహరిస్తారని సమాచారం.రాజమౌళితో సినిమా చేస్తున్న సమయంలో మహేష్ బాబుకి నెల రోజుల గ్యాప్ దొరికిందంటే మాములు విషయం కాదు. మహేష్ పాస్‌పోర్ట్ సీజ్ చేయడం అంత బిజీ కాదు అంటూ నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలలో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకంపై కే ఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు.