HomeCinemaMahesh Babu Ss Rajamouli Ssmb 29 Movie Update
మళ్లీ యాక్షన్ షురూ!
మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒడిశాలోని పర్వత ప్రాంతాల్లో జరిపిన తొలి షెడ్యూల్లో ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కించారు. ఆ తర్వాత షూటింగ్‌కు కాస్త విరామాన్ని ప్రకటించింది చిత్రబృందం.
ఈ గ్యాప్‌లో మహేష్‌బాబు, రాజమౌళి ఇద్దరూ విదేశాలకు వెళ్లారు. ఇటలీ విహార యాత్రకు వెళ్లిన మహేష్‌బాబు మంగళవారం హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ డాక్యుమెంటరీ ప్రచారం కోసం రాజమౌళి కుటుంబ సభ్యులతో కలిసి జపాన్ వెళ్లారు. ఆయన వచ్చిన వెంటనే రెండో షెడ్యూల్‌ను మొదలుపెడతారని సమాచారం. ఈ రెండో షెడ్యూల్లో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తారని చెబుతున్నారు.
ఇక ఈ సినిమాలో మహేష్‌బాబు..రుద్ర అనే పాత్రలో కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. దాదాపు వెయ్యికోట్ల భారీ వ్యయంతో జంగిల్ యాక్షన్ అడ్వెంచర్‌గా నిర్మాత కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.