GlobeTrotter | దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేశ్ – రాజమౌళి కాంబోలో ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ సెట్స్ నుంచి తాజాగా ఒక ఫొటో బయటకి వచ్చింది. SSMB29 సెట్స్‌లో నటుడు మహేశ్ బాబుతో పాటు ప్రియాంకచోప్రా కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని ఈ ఏడాది నవంబర్‌లో విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. గ్లోబ్ ట్రాటర్ని (GlobeTrotter) పరిచయం చేయబోతున్నట్లు తెలిపింది.