Mahesh Babu New Look | ‘సర్కారు వారి’ పాట సినిమాతో అభిమానుల్లో జోష్ నింపాడు మహేష్‌బాబు. ప్రస్తుతం అదే జోష్‌తో త్రివిక్రమ్‌తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్‌కు సిద్ధమవుతుంది. ఈ చిత్రంలో మహేష్ గతంలో ఎన్నడూ చేయలేని మాస్ పాత్రలో కనిపించనున్నాడట. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఎప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా చిత్రబృందం ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా మహేష్‌బాబు లుక్ ఒకటి నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది.
లేటెస్ట్గా రిలీజ్ అయిన లుక్‌లో మహేష్‌బాబు సరికొత్త హేయిర్ స్టైల్‌తో అల్ట్రా స్టైలిష్‌గా ఉన్నాడు. ప్రముఖ సెలబ్రెటీ హేయిర్డ్రెస్సర్ అలీమ్ హకిమ్ మహేష్‌బాబు ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. మరి ఈ హేయిర్ స్టైల్ సినిమా కోసమా.. లేదంటే క్యాజువల్‌గా చేయించుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇక మహేష్-తివిక్రమ్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. హారికా& హాసినీ క్రియేషన్స్ పతాకంపై చినబాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడట.
Read Also:
Sai Rajesh | లగ్జరీ కారును బహుమతిగా పొందిన ‘హృదయ కాలేయం’ దర్శకుడు
అరుదైన అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్.. తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డు
Rishab Shetty | రిషబ్ శెట్టికి తెలుగులో ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట.. ఎందుకో తెలుసా?’
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కృష్ణ వ్రింద విహారి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?