Rishab Shetty | రిషబ్ శెట్టికి తెలుగులో ఆ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట.. ఎందుకో తెలుసా?
Rishab Shetty About Her Favourite Telugu Hero | ఈ మధ్య కాలంలో కన్నడ సినిమాలు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. 'కేజీఎఫ్' తర్వాత పలు కన్నడ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన 'కాంతార' మూవీ తెలుగులో విడుదలకు సిద్ధమైంది.
Rishab Shetty About Her Favourite Telugu Hero | ఈ మధ్య కాలంలో కన్నడ సినిమాలు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ‘కేజీఎఫ్’ తర్వాత పలు కన్నడ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవలే కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన ‘కాంతార’ మూవీ తెలుగులో విడుదలకు సిద్ధమైంది. రిషబ్ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం తెలుగులో భారీగా ప్రమోషన్లు జరుపుతున్నారు. ప్రమోషన్లో భాగంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.
రిషబ్‌శెట్టి తాజాగా ఓ ఇంటర్వూలో తెలుగు నటుల గురించి చెప్పాడు. తను చిన్నప్పటి నుండి తెలుగు సినిమాలు చూస్తున్నానని. సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు చూసేవాడినని చెప్పాడు. అంతేకాకుండా తనకు తారక్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. ఎందుకంటే ఎన్టీఆర్ వాళ్ల అమ్మ.. తన ఊరేనని చెప్పాడు. ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుందని వెల్లడించాడు. ఇక మహేష్ బాబు, అల్లుఅర్జున్, రామ్‌చరణ్ సినిమాలను కూడా చూస్తానని చెప్పాడు.
రిషబ్‌శెట్టి కన్నడ ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ వైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరో వైపు నటుడిగా, ప్రొడ్యూసర్‌గా చేస్తూ సినీరంగంలో దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవలే కన్నడలో విడదులైన కాంతార సినిమా దాదాపు రూ.80 కోట్ల వరకు గ్రాస్‌ను కలెక్ట్ చేసి సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు.
Read Also:
అరుదైన అవార్డును గెలుచుకున్న అల్లు అర్జున్.. తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డు
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘కృష్ణ వ్రింద విహారి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ravi Teja | రీ-రిలీజ్‌కు రెడీ అవుతున్న రవితేజ బ్లాక్‌బస్టర్ మూవీ?
The Ghost Movie | ‘ది ఘోస్ట్’ తెలుగులో ఫట్.. కానీ అక్కడ మాత్రం సూపర్ హిట్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

