Mahesh Babu | అగ్ర నటుడు మహేశ్‌బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా గురించి దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ఓ షెడ్యూల్‌ని రాజమౌళి ఫినిష్ చేశారని విశ్వసనీయ సమాచారం. ఇప్పుడు లేటెస్ట్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఒడిశా వెళ్లారట. అక్కడ కోరాపుట్ పరిసరాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తున్నది.
నేటి నుంచే షూటింగ్ ప్రారంభం. ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృధ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు గట్టిగా వార్తలొస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇంకా హాలీవుడ్‌కి చెందిన పలువురు నటులు ఈ సినిమాలో భాగం కానున్నారు. అమేజాన్ అడవుల నేపథ్యంలో సాగే ట్రజర్ హంట్ కథాంశంతో, దాదాపు వెయ్యికోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి కె.ఎల్.నారాయణ నిర్మాత కాగా, ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.