పోకిరి, బిజినెస్‌మ్యాన్ సినిమాల్లో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించారు మహేశ్. అయితే పూర్తిస్థాయి అండర్‌వరల్డ్ డాన్‌గా నెగెటివ్ షేడ్‌లో మాత్రం ఎప్పుడూ చేయలేదు. నిజంగా అలా కనిపిస్తే సూపర్‌స్టార్ అభిమానులకు పండుగే. త్వరలో మహేశ్ అలా కనిపించనున్నారు. మహేశ్ కోసం దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఆ తరహా కథను సిద్ధం చేశారు. మహేశ్‌కు కూడా ఆ కథ బాగా నచ్చిందంట. ఈ విషయాన్ని సందీప్ స్వయంగా తెలియజేశారు. రణబీర్‌కపూర్‌తో ఆయన చేస్తున్న ‘యానిమల్’ చిత్రం డిసెంబర్లో విడుదలకానుంది. ప్రభాస్‌తో చేయనున్న ‘స్పిరిట్’ స్క్రిప్ట్ దశలో ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా ఉంటుంది.
ఈ సినిమాలన్నీ పూర్తవ్వటానికి రెండుమూడేళ్లు పట్టడం ఖాయం. ఇక మహేశ్‌బాబు ‘గుంటూరుకారం’ డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి ప్రాజెక్ట్‌లోకి ఎంటరవుతారాయన. ఇక రాజమౌళి సినిమా అంటే రెండేళ్లు కామనే కదా. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాత మహేశ్, సందీప్‌రెడ్డి సినిమా ఉండొచ్చనేది ఫిలింవర్గాల టాక్. ఏదేమైనా ఓ రెండుమూడేళ్లు ఆగాల్సిందే.