Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్ బాబు తన తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణని తలచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈరోజు ఆయన నటించిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగబోతుండగా.. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ మహేశ్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహేశ్ బాబు, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రాబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు సాయంత్రం గ్లోబ్ ట్రాటర్ అనే పేరుతో భారీ ఈవెంట్ జరుగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలో తన తండ్రిని మిస్ అవుతున్న మహేశ్ బాబు ఆయనను గుర్తుచేసుకుంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
మహేశ్ ఎక్స్ వేదికగా రాసుకోస్తూ.. ఈరోజు మిమ్మల్ని నేను కాస్త ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నాను నాన్న… మీరు గర్వపడతారని నాకు తెలుసు నాన్న (Thinking of you a little more today… and knowing you’d be proud nanna) అంటూ మహేశ్ బాబు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. దీనికి కృష్ణతో దిగిన ఒక ఫొటోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్గా మారింది.
Thinking of you a little more today…
and knowing you’d be proud nanna ♥️♥️♥️ pic.twitter.com/yuW1g9WOky— Mahesh Babu (@urstrulyMahesh) November 15, 2025