మహేష్‌బాబుతో రాజమౌళి రూపొందిస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’లో పలువురు అగ్ర తారలు భాగమవుతున్న విషయం తెలిసిందే. ప్రతినాయకుడు కుంభ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌సుకుమారన్, మందానికిగా కథానాయిక ప్రియాంకచోప్రా ఫస్ట్‌లుక్స్‌కి మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో మాధవన్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఆయన పాత్ర తాలూకు వివరాలు ఇప్పటివరకు వెల్లడికాలేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపిస్తారని సమాచారం.
ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో రామాయణ ఘట్టం సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని చెప్పారు దర్శకుడు రాజమౌళి. ఈ ఎపిసోడ్లో రాముడి పాత్రలో మహేష్‌బాబు కనిపిస్తారు. దాదాపు 30 నిమిషాల నిడివితో సాగే ఈ ఎపిసోడ్ హైలైట్‌గా ఉంటుందని, మాధవన్ హనుమంతుడి పాత్రధారిగా కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ముప్పైశాతం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా మరో భారీ షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.