Mahavatar Narasimha OTT | ఈ మధ్యకాలంలో అన్ని వయసుల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘మహావతార్: నరసింహ’. జులై 25న విడుదలైన ఈ యానిమేటెడ్ డివోషనల్ వండర్ అంచనాలకు మించి విజయం సాధిస్తూ థియేటర్లలో హవా చూపిస్తోంది. మొదటి రోజు నెమ్మదిగా మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్లో చేరి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న ప్రశ్న… ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో వస్తుంది అని? ఇప్పుడు పలు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడుతున్నాయి. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, ‘జియో హాట్‌స్టార్’ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్.
నిర్మాణ సంస్థతో ఉన్న సంబంధాల కారణంగా ఈ డీల్ కుదిరే అవకాశాలు ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు డిజిటల్ హక్కులు దక్కించుకోవడానికి ఓటీటీ సంస్థలు భారీ మొత్తాలు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. రూ.50 కోట్లకు పైగా ఓటీటీ డీల్ కుదిరే ఛాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. సినిమాను తెలుగు, హిందీతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తుంది. అయితే ‘మహావతార్: నరసింహ’ ప్రస్తుతం ఫుల్ ఆక్యుపెన్సీతో థియేటర్లలో రన్ అవుతున్న నేపథ్యంలో , ఓటీటీ రిలీజ్ సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ మొదట్లో ఉండొచ్చని మార్కెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అధికారిక తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఇప్పటివరకు ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా రూ.105 కోట్లు వసూలు చేసింది. దీనితో పాటు, అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్ మూవీగా గుర్తింపు పొందింది. ఇటీవల విడుదల చేసిన సక్సెస్ ట్రైలర్‌కి కూడా అద్భుత స్పందన లభిస్తోంది. ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా ‘నరసింహ’ తొలి చిత్రం కాగా, రెండవ మూవీగా ‘మహావతార్: పరశురామ్’ 2027లో విడుదల కానుందని డైరెక్టర్ అశ్వినీ కుమార్ తెలిపారు. విష్ణుమూర్తి 10 అవతారాలను ఆధారంగా చేసుకొని, ప్రతి రెండు సంవత్సరాలకు ఓ మూవీ చొప్పున 2037 వరకు ప్లాన్ చేసినట్టు హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది.ఇప్పటి వరకు మహావతార్ నరసింహ చిత్రం ఇప్పటివరకు రూ.105 కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడిగా అశ్వినీ కుమార్ వ్యవహరించగా, ‘హోంబలే ఫిల్మ్స్’ బ్యానర్‌పై నిర్మితమైంది. విడుదలకు ముందు పెద్దగా ఆసక్తి లేని ఈ చిత్రానికి, విడుదల తర్వాత మాత్రం అద్భుతమైన స్పందన వచ్చింది.