సూపర్ స్టార్ మహేష్ బాబు- క్రేజీ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందిన చిత్రం మహర్షి. ఈ సినిమా మహేష్ కెరియర్లో 25వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సాధించింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయికగా నటించింది.
వెండితెరపైనే కాక బుల్లితెరపై సత్తా చూపిస్తుంది మహర్షి మూవీ. ఈ చిత్రం పదోసారి జెమినీ టీవీలో ప్రసారం అయ్యి సాలిడ్ టీఆర్పీని దక్కించుకుంది. తొమ్మిది సార్లు ఈ చిత్రం మంచి టీఆర్పీ సాధించగా, పదోసారి 7.82 రేటింగ్స్‌తో అదరగొట్టింది. ఒక సినిమా పదోసారి కూడా టీవీలో ప్రసారం అయ్యి ఈ రేంజ్లో టీఆర్పీను తెచ్చుకోవడం అంటే మామూలు విషయం కాదంటున్నారు. ఇక మహర్షి సాధించిన ఈ రేర్ ఫీట్‌ను సెలెబ్రేట్ చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Ruling South India Box office as a Emperor #Maharshi delivers
— Movies Corner ✊ᵂᵉᵃʳ ᵃ ᴹᵃˢᵏ😷 (@Tollywood_Newzz) June 18, 2021
mammoth TRP rating on its 10th time
1st Time: 9.3
2nd time : 7.3
3rd Time: 6.13
4th time: 9.02
5th Time: 10.28
6th Time: 8.82
7th Time: 7.14
8th Time: 5.14
9th Time: 4.92
10th Time: 7.82**#SarkaruVaariPaata pic.twitter.com/pRHMHZcVJu