మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో సావిత్రి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ఆధ్వర్యంలో ‘సంగమం ఫాండేషన్’ ఛైర్మన్ సంజయ్కిషోర్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మహానటికి మరణం లేదని, నవరసాల నమ్మేళనంగా అద్భుత నటనాకౌశలంతో ప్రేక్షకులను మైమరపించేవారని అన్నారు.
సావిత్రి అభినయ నట శాస్త్ర గ్రంథమని కొనియాడారు. ఈ సందర్భంగా ‘మహానటి’ చిత్ర నిర్మాతలు ప్రియాంకదత్, స్వప్నదత్,, రచయిత సంజయ్కిషోర్, ప్రచురణకర్త బొల్లినేని కృష్ణయ్యలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, తనికెళ్ల భరణి, రోజారమణి తదితరులు పాల్గొన్నారు.