Madhuri Dixit | హీరోయిన్గా రాణించాలని సినీరంగంలోకి వస్తున్నారంటే వాళ్లు ఎన్నో విమర్శలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో ప్రశ్నలను, దేహం, మాట తీరు, వేషాధారణ ఇలా ప్రతి విషయంలో ఛాన్స్ దొరికితే ప్రతి ఒక్కరు మాటలతో దాడి చేస్తూ ఉంటారు. వీటన్నిటిని దాటితోనే గొప్ప హీరోయిన్గా రాణించగలరు అని సీనియర్ అగ్ర కథానాయికలు చెబుతుంటారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ కూడా సినీరంగంలోకి వచ్చినప్పుడు ఇలాంటి విమర్శలనే ఎదుర్కున్నానని తెలిపింది.
తాజాగా ఒక ఇంటర్వూలో పాల్గొన్న మాధురి తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తొలినాళ్లలో తన లుక్స్‌పై విమర్శలు ఎదుర్కున్నానని తెలిపింది. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తాను కనిపించడానికి చిన్న అమ్మాయిలా ఉన్నానని హీరోయిన్గా తను ఏమాత్రం కనిపించడంలేదని చాలా మంది విమర్శించారని వెల్లడించింది. అప్పట్లో హీరోయిన్ అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ అందరిలో ఓ ఊహాగానాలు ఉన్నాయిని పేర్కొంది. ఆ సమయంలో మా అమ్మ నాకు అండగా ఉండేది. నేను ఎంచుకున్న మార్గం కరెక్ట్ అని.. ఇందులో మంచి గుర్తింపు సాధిస్తానని మా అమ్మ నాకు ఎప్పుడూ ధైర్యాన్ని ఇచ్చేదని తెలిపింది. ప్రస్తుతం ఈమె నటించిన ‘ఫేమ్ గేమ్ వెబ్’ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.