ఐదు పదుల వయస్సు దాటినా ఆ ఛాయలేమి కనిపించవు. ఆ తార డ్యాన్సింగ్ స్టైల్ ను ఇప్పటి హీరోయిన్లు బీట్ చేయడం కష్టమనే చెప్పాలి. యాక్టింగ్ లో, డ్యాన్స్ లోనూ అప్ కమింగ్ తారలకు గట్టి పోటీ నిచ్చే ఆ తార ఎవరనే కదా మీ డౌటు. అలనాటి అందాల తార మాధురీదీక్షిత్. చాలా కాలంగా టీవీ షోలకు ఎక్కువ టైం కేటాయిస్తోన్న మాధురీ రీసెంట్ గా మరాఠి సినిమాలో కనిపించింది. చాలా కాలం నుంచి టెలివిజన్ షోలతో బిజీగా ఉన్న ఈ భామ ఇక నుంచి ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటుందట.
దక్షిణాదిన మంచి పాత్రలు వస్తే నటించేందుకు సిద్దంగా ఉన్నానని ఓ ఇంటర్య్వూలో చెప్పింది. సౌత్‌లో మంచి కంటెంట్ వస్తుందని, ఒకవేళ తనకు ఛాలెంజింగ్ పాత్రలు చేసే ఛాన్స్ వస్తే సంతోషంగా చేస్తానని చెప్పుకొచ్చింది. దీంతో మాధురీదీక్షిత్‌కు తెలుగులో అవకాశం రావాలని, ఇక్కడ తన స్టామినా ఏంటో చూపించాలని కోరుకుంటున్నారు ఆమె ఫాలోవర్లు.
ఇవి కూడా చదవండి..
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్
ప్రభాస్ టు సాయిపల్లవి..సౌతిండియా స్టార్లు ఏం చదివారో తెలుసా..?
ఈ స్టార్ హీరోకు పాపులర్ హీరోయిన్ కావాలట..!
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్