Madhuri Dixit | ఒకప్పుడు టాప్ హీరోయిన్గా, డ్యాన్స్ క్వీన్‌గా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్. అయిదు పదులలో కూడా ఆమె అందం వయసు నిండా పదహారే! నటిగా వెండితెరపై కాస్త గ్యాప్ తీసుకున్నా.. యాడ్స్‌లో నటిస్తూ, పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ అభిమానులను పలకరిస్తూనే ఉంది. అయితే తాజాగా మాధురీ దీక్షిత్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తుంది. బీజేపీ పార్టీ అభ్యర్థిగా మాధురీ దీక్షిత్ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
లేటెస్ట్గా రాత్రికి రాత్రి మహారాష్ట్రలోని ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో మాధురీ దీక్షిత్ బ్యానర్లు వెలిశాయి. దీంతో ప్రస్తుతం బీజేపీ ప్రస్తుత ఎంపీ పూనమ్ మహాజన్ స్థానంలో మాధురీ దీక్షిత్ ఎన్నికల్లో పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబైలోని మాధురీ దీక్షిత్ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు సంబంధించిన బుక్‌లెట్‌ను మాధురీకి గిప్ట్గా ఇచ్చాడు అమిత్ షా. దీంతో మాధురీ దీక్షిత్ బీజేపీలో చేరుతారనే చర్చకు మరింత బలం చేకూరింది. ఇక దీనిపై మాధురీ దీక్షిత్ అధికారికంగా స్పందిచాల్సి ఉంది.