ప్రముఖ బాలీవుడ్ నృత్య దర్శకురాలు, దివంగత సరోజ్‌ఖాన్ జీవితం వెండితెరపైకి రాబోతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో అనేక సూపర్‌హిట్ చిత్రాలకు ఆమె నృత్య దర్శకత్వం వహించారు. 3000 పాటలకు కొరియోగ్రాఫర్‌గా పని చేసి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో మంది నృత్య దర్శకులను పరిచయం చేశారు. టీ సిరీస్ భూషణ్‌కుమార్ తెరకెక్కించబోతున్న ఈ బయోపిక్కు హన్సల్ మోహతా దర్శకత్వం వహిస్తారు.
తాజా సమాచారం ప్రకారం సరోజ్‌ఖాన్ పాత్రలో మాధురీదీక్షిత్ నటించబోతున్నట్లు తెలిసింది. మాధురీదీక్షిత్ నర్తించిన ఎన్నో హిట్ సాంగ్స్‌కు సరోజ్‌ఖాన్ నృత్యరీతులను సమకూర్చారు. ‘ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నది. సరోజ్‌ఖాన్ జీవితంలోని వివిధ దశలను ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఇద్దరు నాయికలు ఇందులో ప్రధాన భూమిక పోషిస్తారు’ అని దర్శకుడు హన్సల్ మెహతా తెలిపారు.