శివ కంఠమనేని, క్యాథలిన్ గౌడ జంటగా నటిస్తున్న చిత్రం ‘మధురపూడి గ్రామం అనే నేను’. మల్లి దర్శకుడు. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్.వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు. అక్టోబర్ 13న విడుదల కానుంది. దర్శకుడు మాట్లాడుతూ ‘మనుషులకు ఆత్మ ఉన్నట్లే.. ఒక ఊరికి ఆత్మ ఉండి తన కథ తానే చెబితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో నడిచే చిత్రమిది.
ఒంగోలు, చీరాల నేపథ్యంలో కథ నడుస్తుంది. ఆద్యంతం ఉత్కంఠను పంచుతూ సాగుతుంది. యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు. భరణి శంకర్, సత్య, నూకరాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సురేష్ భార్గవ్, సంగీతం: మణిశర్మ, రచన-దర్శకత్వం: మల్లి.