ఉదయ్‌రాజ్, వైష్ణవిసింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మధురం’. రాజేష్ చికిలే దర్శకత్వంలో యం.బంగార్రాజు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘1990 నేపథ్యంలో జరిగే టీనేజ్ ప్రేమకథా చిత్రమిది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆనాటి విద్యార్థుల జీవన శైలిని కళ్లకుకట్టినట్లుగా ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
గ్రామీణ నేపథ్యంలో చక్కటి ప్రేమకథగా ఆకట్టుకుంటుంది’ అన్నారు. సుందరమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపామని, త్వరలో రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మనోహర్ కొల్లి, సంగీతం: వెంకీ వీణ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజేష్ చికిలే.