Madhu Priya | టాలీవుడ్‌కి చెందిన ప్రముఖ ఫోక్ సింగర్ మధుప్రియ చెల్లి శ్రుతి ప్రియ వివాహం ఆగస్టు 6న ఘనంగా జరిగింది. సుమంత్ పటేల్ అనే యువకుడితో శ్రుతి ప్రియ ఏడడుగులు వేసింది. ఈ వేడుకకి ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, ప్రముఖులు, ఫోక్ కళాకారులు, సినీ సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు హాజరై సందడి చేశారు. పెళ్లి వేడుకలో నర్సపల్లె సాంగ్ ఫేమ్ కనకవ్వ లైవ్ పర్ఫార్మెన్స్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక అక్క మధుప్రియ కూడా తన ఎనర్జిటిక్ డ్యాన్సులతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్స్‌లో కూడా తెగ సందడి చేసింది మధుప్రియ
హల్దీ, మెహందీ, సంగీత్, బరాత్ వంటి ఈవెంట్లలో మధుప్రియ తన కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి డ్యాన్స్‌లు చేసి అందరినీ ఆకట్టుకుంది. ప్రత్యేకంగా ఆమెను చూసేందుకు, సెల్ఫీలు తీయడానికి చాలామంది అభిమానులు కూడా వచ్చారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వేడుకను చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శ్రుతి ప్రియ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే తాజాగా మధు ప్రియ తన సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు షేర్ చేయగా, ఇందులో ఈ అమ్మడి సందడి మాములుగా లేదు. హంగామా అంతా తనదే అన్నట్టుగా ఈ వేడుక సాగింది.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన మధుప్రియ, “ఆడపిల్లనమ్మా” పాటతో తొలి గుర్తింపు పొందింది. అనంతరం 2011లో “దగ్గరగా దూరంగా” సినిమాలో “పెద్దపులి” పాటతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత ఫిదా, సరిలేరు నీకెవ్వరు, బంగార్రాజు, లైలా, టచ్ చేసి చూడు, సాక్ష్యం, నేల టికెట్ వంటి ఎన్నో సినిమాల్లో ఆమె పాడిన పాటలు ప్రేక్షకులను, సంగీతాభిమానులను అలరించాయి. సినీ ప్రయాణంతోపాటే మధుప్రియ వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లోకి వచ్చింది. 18 ఏళ్ల వయసులో శ్రీకాంత్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ఆమె, కొన్ని సంవత్సరాల తర్వాత అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతం తల్లిదండ్రులతో కలిసి ఉంటూ కెరీర్ ముందుకు కొనసాగిస్తుంది.