రవితేజ సోదరుడైన రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మారెమ్మ’. మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు. సోమవారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో మాధవ్ రగ్గ్డ్ లుక్‌లో కనిపించారు. ఎలాంటి సవాలునైనా ఎదుర్కోవడానికి సిద్ధమన్నట్లు ఆయన లుక్ పవర్‌ఫుల్‌గా అనిపిస్తున్నది. ‘గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.
తొలి చిత్రమైనా మాధవ్ తన పాత్రకోసం పూర్తి మేకోవర్‌తో సిద్ధమయ్యారు. ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా కథ సాగుతుంది’ అని మేకర్స్ తెలిపారు. దీపాబాలు, వినోద్ కుమార్, వికాస్ వశిష్ట తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి, నిర్మాత: మయూర్ రెడ్డి బండారు, రచన-దర్శకత్వం: మంచాల నాగరాజ్.