తమిళ అగ్ర హీరో శివకార్తికేయన్ కథానాయకుడిగా రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘మదరాసి’. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకుడు. శ్రీలక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో ఉద్వేగపూరితమైన యాక్షన్ ఎంటైర్టెనర్‌గా ఈ సినిమా ఉంటుందని, దర్శకుడు మురుగదాస్ విజువల్ వండర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని మేకర్స్ చెబుతున్నారు. రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సుదీప్ ఎలామోన్, సంగీతం: అనిరుధ్ రవిచందర్.