‘మ్యాడ్’ సినిమా యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. దీంతో సీక్వెల్‌గా రానున్న ‘మ్యాడ్ స్కేర్’ కోసం ప్రేక్షకుల్లో ఉత్సుకత పెరిగింది. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మాతలు. ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. తొలిభాగం కంటే రెట్టింపు వినోదం, ఊహించిన దానికంటే ఎక్కువ మ్యాడ్‌నెస్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుందని, వినోదాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని దర్శకుడు తెలిపారు. ఇప్పటికే విడుదలైన లడ్డుగాని పెళ్లి, స్వాతి రెడ్డి పాటలు శ్రోతల ఆదరణ పొందాయని, సంగీతానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: సూర్యదేవర నాగవంశీ, దర్శకత్వం: కల్యాణ్‌శంకర్.