మోహన్ వడ్లపట్ల స్వీయదర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘M4M’ (Motive for murder). జో శర్మ కథానాయిక. ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. దర్శక,నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ ‘ కథను నమ్ముకొని చేసిన సినిమా ఇది. 110ఏళ్ల సినిమా చరిత్రలో ఇప్పటివరకూ ఇలాంటి కాన్సెప్ట్ రాలేదని నమ్మకంగా చెప్పగలను.
హాలీవుడ్ రేంజ్లో సినిమాను తెరకెక్కించాం. జోశర్మ నటన సినిమాకు హైలైట్. విడుదలైన ఫస్ట్‌డే ఈ సినిమా చూసి, ఇందులో కిల్లర్ ఎవరో గెస్ చేసి చెప్తే, ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తాం’ అని తెలిపారు. ఇందులో తాను ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్‌గా చేశానని, ఆద్యంతం ఉత్కంఠభరితంగా సినిమా ఉంటుందని జోశర్మ తెలిపింది.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాలో సంబీత్ ఆచార్య, శుభలేఖ సుధాకర్, ఎంఆర్సీ వడ్లపట్ల, తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ షానమోని, సంగీతం: వసంత్ ఇసాయిపట్టై.