Lucky Baskhar | దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న విడుదలైంది. ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో మూవీ విజయవంతంగా రన్ అవుతోంది. భారీగానే వసూళ్లు రాబడుతున్నది. ఈ క్రమంలో ఓటీటీలోకి ఎప్పుడు విడుదలవుతుంది.. ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే, థియేటర్ రన్ ముగిసిన తర్వాత లక్కీ భాస్కర్ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. నవంబర్ 30 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. అయితే, ఇప్పటి వరకు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన లక్కీ భాస్కర్.. దుల్కర్ సల్మాన్ మహానటి, సీతారామం తెలుగులో నటించిన మూడో చిత్రం. ఈ మూవీలో దుల్కర్ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు.
80వ దశకం నేపథ్యంలో సాగే ఈ చిత్రం మధ్యతరగతి బ్యాంకర్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ప్రైవేట్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేస్తూ.. చాలీ చాలని జీతం, అప్పులో ఇబ్బందులు.. తమ్ముడు, చెల్లి, నాన్న, భార్య బాగోగులు చేసుకుంటూ బ్యాంక్‌లో బెస్ట్ ఎంప్లాయ్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుంటారు. అయితే, ఆశించిన జీతం, ప్రమోషన్స్ మాత్రం ఉండవు. ఓ వైపు అప్పులతో ఇంటా, బయట భాస్కర్ అవమానాలను ఎదుర్కొంటాడు. ఆ తర్వాత ఓ ఆటకు బానిసవుతాడు.. దాంతో డబ్బు సరిపడా రావడం.. అక్కడితో ఆగకుండా హర్షద్ మెహతా బ్యాంక్ స్కామ్‌లోనూ భాగం అవుతాడు. తనకు తెలిసిన, వచ్చిన జూదాన్ని తెలివిగా ఆడుతూ కోట్లు ఆర్జిస్తుంటాడు. ఆ సంపాదనతో అతను ఎలా చిక్కుల్లో పడుతాడు.. మళ్లీ బయటపడుతాడా? అనేది సినిమా స్టోరీ. ఇక ఈ మూవీ మూడురోజుల్లోనే రూ.40కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. యూఎస్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్లో చేరింది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా.. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చూన్ ఫర్ సినిమాస్ నిర్మించింది.