Lucifer | ఆరేళ్ల క్రితం విడుదలైన మలయాళ చిత్రం ‘లూసిఫర్’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయం సాధించింది. మోహన్‌లాన్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ఎల్ 2: ఎంపురాన్’ నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. దాదాపు 180కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాపై దక్షిణాదిలో భారీ అంచనాలున్నాయి.
అయితే ఈ సినిమా టైటిల్ ‘ఎంపురాన్’కు అర్థమేమిటని చర్చ సోషల్‌మీడియాలో జరుగుతున్నది. ‘లూసిఫర్’ అంటే క్రైవస్తంలో దైవదూత అని అర్థం. భగవంతుని ఆజ్ఞను వ్యతిరేకించి భువిపైకి వచ్చి దుష్టుడిగా మారి, మానవాళి పాపాలు చేసేందుకు ప్రేరేపించేవాడినే ‘లూసిఫర్’ అంటారు. ఇక సీక్వెల్ ‘ఎంపురాన్’ టైటిల్ అర్థం ఏమిటంటే..‘రాజు కంటే ఎక్కువ.దేవుడి కంటే తక్కువ’ అని అర్థం. సినిమాలో హీరో మోహన్‌లాల్ పాత్ర తాలూకు వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ ఈ టైటిల్ పెట్టారని తెలిసింది.