గురువారం 26 నవంబర్ 2020
Cinema - Oct 30, 2020 , 18:23:49

నిర్మాతగా మారుతున్న లవర్‌ బాయ్

నిర్మాతగా మారుతున్న లవర్‌ బాయ్

నువ్వే కావాలి చిత్రంతో హీరోగా అరంగ్రేటం చేసిన తరుణ్.. వరుస విజయాలతో లవర్‌బాయ్ ఇమేజ్‌తో దూసుకవెళ్లాడు. ఆ తరువాత వచ్చిన వరుస ఫ్లాప్‌లతో హీరోగా దాదాపు రిటైర్‌మెంట్ ప్రకటించాడు ఈ యువ కథానాయకుడు. తాజాగా ఈ లవర్‌ బాయ్ నిర్మాతగా మారుతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ప్రకటించాడు. త్వరలోనే మూడు ప్రాజెక్టులను నిర్మించనున్నట్లు అందులో రెండు వెబ్‌సీరిస్‌లు కాగా, మరొకటి తను హీరోగా నటించనున్న సినిమా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలో ఈ సినిమాలకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని చెప్పాడు తరుణ్.