Love Story Collections | ‘లవ్ స్టోరి’ వీకెండ్ కలెక్షన్స్..అసలు పరీక్ష ఇప్పుడే మొదలైంది..!
దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ థియేటర్స్ దగ్గర సందడి కనిపించింది. ఓ సినిమా 3 రోజుల పాటు హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచింది. అదే టాలీవుడ్ (Tollywood) దర్శకుడు శేఖర్‌కమ్ముల (Sekhar Kammula) తెరకెక్కించిన లవ్‌స్టోరీ (Love Story) చిత్రం.

దాదాపు నాలుగు నెలల తర్వాత మళ్లీ థియేటర్స్ దగ్గర సందడి కనిపించింది. ఓ సినిమా మూడు రోజుల పాటు హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచింది. అదే టాలీవుడ్ (Tollywood) దర్శకుడు శేఖర్‌కమ్ముల (Sekhar Kammula) తెరకెక్కించిన లవ్‌స్టోరీ (Love Story) చిత్రం. నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా నటించారు. సీటీమార్ లాంటి సినిమాలు ఒకట్రెండు రోజులు మాత్రమే ఫుల్ కలెక్షన్స్ తీసుకొచ్చాయి. ఆ తర్వాత పూర్తిగా డల్ అయిపోయాయి. అయితే లవ్ స్టోరీ సినిమాకు ఊహించని రికార్డు వసూళ్లు వచ్చాయి.
మూడు రోజుల్లోనే ఈ చిత్రం 23 కోట్ల షేర్ వసూలు చేసి నిర్మాతల్లో కొత్త ఆశలను నింపింది. చూస్తుంటే జాతి రత్నాలు తర్వాత 1 మిలియన్ వైపు అడుగులు వేసేలా కనిపిస్తుంది ఓవర్సీస్లో. అక్కడ తొలిరోజే హాఫ్ మిలియన్ మార్క్ అందుకోవడం గమనార్హం. తొలిరోజే 10 కోట్ల వరకు షేర్ వసూలు చేసిన లవ్ స్టోరీ.. తర్వాత రెండు రోజుల్లోనూ అదే జోరు చూపించింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం మోత మోగిపోతున్నాయి.

లవ్ స్టోరీ మూడో రోజు కలెక్షన్స్
నైజాం: 2.54 కోట్లు
సీడెడ్: 0.83 కోట్లు
ఉత్తరాంధ్ర: 0.57 కోట్లు
ఈస్ట్: 0.29 కోట్లు
వెస్ట్: 0.20 కోట్లు
గుంటూరు: 0.31 కోట్లు
కృష్ణా: 0.30 కోట్లు
నెల్లూరు: 0.15 కోట్లు
ఏపీ + తెలంగాణ మూడో రోజు కలెక్షన్స్: 5.19 కోట్లు షేర్ (9.10 కోట్లు గ్రాస్)
లవ్ స్టోరీ 3 డేస్ కలెక్షన్స్
నైజాం: 8.16 కోట్లు
సీడెడ్: 2.72 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.98 కోట్లు
ఈస్ట్: 1.05 కోట్లు
వెస్ట్: 0.94 కోట్లు
గుంటూరు: 1.15 కోట్లు
కృష్ణా: 0.87 కోట్లు
నెల్లూరు: 0.54 కోట్లు
ఏపీ + తెలంగాణ: 17.70 కోట్లు (28 కోట్లు గ్రాస్)
రెస్ట్ ఆఫ్ ఇండియా: 0.92 కోట్లు
ఓవర్సీస్: 3.75 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్: 22.07 కోట్లు షేర్ (37.50 కోట్ల గ్రాస్)
‘లవ్ స్టోరి’ సినిమాకు రూ.31.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. 33 కోట్ల బ్రేక్ ఈవెన్ చేస్తే సినిమా సేఫ్ అయినట్లు. తొలి మూడు రోజుల్లో22 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. వీక్ డేస్ కూడా బాగా పర్ఫార్మ్ చేస్తే కచ్చితంగా నిర్మాతలతో పాటు బయ్యర్లు కూడా సేఫ్ అయిపోయినట్లే. సోమవారం వచ్చే వసూళ్లు చూసిన తర్వాత సినిమా నిలబడుతుందా లేదా అనేది అర్థమవుతుంది. మరి చూడాలిక.. లవ్ స్టోరి సినిమాకు ఆ లాంగ్ రన్ ఉందో లేదో..?
ఇది కూడా చూడండి
ఇవి కూడా చదవండి..
Rakul Preet Singh | రకుల్ ప్రీత్ సింగ్ సర్జరీ చేయించుకుందా..?
Vijay 66th | టాలీవుడ్ దర్శకుడితో విజయ్ కొత్త సినిమా..!
Rashmika Mandanna | అప్పుడు నో చెప్పింది..ఇపుడు ఒకే చేసింది
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

